పొన్నూరు: రోడ్డు ప్రమాదంలో పొన్నూరుకు చెందిన ప్రముఖ ధార్మికవేత్త అమీర్ ముద్బాల్ జానీ బేగ్ మృతి
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ప్రముఖ ధార్మికవేత్త పొన్నూరు మండల అమీర్ మగ్బుల్ జానీ బేగ్ మంగళవారం చేబ్రోలు-నారాకోడూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్కూటీ టైర్ బరస్ట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. వడ్లమూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పొన్నూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.