శ్రీపతిరావు పేట లో ఉపాధి హామీ పనుల వద్ద మహిళల భద్రత సంక్షేమ లక్ష్యంగా శక్తి యా్ పై అవగాహన కల్పించిన ఆత్మకూరు పోలీసులు
శ్రీపతిరావుపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న కరువు పనులకు హాజరైన మహిళలు మరియు అక్కడికి వచ్చిన ఇతరులకు మహిళల భద్రత, సంక్షేమం లక్ష్యంగా "శక్తి యాప్" అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో దానిని ఎలా వినియోగించుకోవాలి అనే విషయాలను వివరించారు. అలాగే శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలియజేశారు.మహిళలు, బాలికల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో (POCSO) చట్టం గురించి అవగాహన కల్పించారు.