గుంతకల్లు: పట్టణంలోని రైల్వే స్టేషన్ లో సెల్ ఫోన్ల దొంగను అరెస్ట్ చేసిన జీఆర్పీ పోలీసులు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ లో శనివారం దొంగ అరెస్ట్ ను చూపించారు. గుంతకల్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరం రాణినగర్ కు చెందిన కుమ్మర నాగరాజు లారీ క్లీనర్ గా పని చేసేవాడు. అయితే లారీ క్లీనర్ గా వచ్చే ఆదాయం చాలక రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, నగదు, విలువైన వస్తువులు చోరీ చేసేవాడు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని అరెస్ట్ చేశారు.