అశ్వారావుపేట: పెన్షన్లు పెంచాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు దమ్మపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన.
పెన్షన్ల పెంపు కోసం ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి పెన్షనర్లు సోమవారం దమ్మపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.. అనంతరం తాసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు,వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఈ రోజున ఆ హామీలను విస్మరించిందని నాయకులు ఆరోపించారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు...