నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో వజ్రాల వేట, వదంతులు నమ్మొద్దు అంటున్న అధికారులు
Nandyal Urban, Nandyal | Jun 11, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె సమీప నల్లమల్ల అడవిలో వజ్రాల వేటకు జనం భారీగా వస్తున్నారు. వర్షాలు కురవడంతో పిల్లాపాపలతో ఇక్కడ నిరీక్షిస్తున్నారు. అయితే, వజ్రాలు దొరుకుతాయనే ప్రచారంలో నిజం లేదని పోలీస్, రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అడవి ప్రాంతంలో ఎలాంటి వజ్రాలు లభించవని, ప్రజలు వదంతులు నమ్మి వచ్చి ఇబ్బందులు పడవద్దని వారు హెచ్చరించారు.