సంగారెడ్డి: 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలయ్యేదాకా పోరాటం కొనసాగిస్తాం : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి
బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ కాసాల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మీడియా సమావేశంలో ఆవుల రాజిరెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేసి 42% బిసి రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు