ఆమదాలవలస: పొందూరు జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నుంచి రోహిణి నామినేషన్
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా పిసిని రోహిణి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వెంకట్రామన్కు ఆమె పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై తనకు నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.