నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందించడమే జగన్ లక్ష్యం: బాలయ్యపల్లి మండలంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దేవిక
తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండపంలో పలు గ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులను వైయస్సార్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావి దేవికా చౌదరి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ కార్డులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందించడమే సీఎం జగన్ లక్ష్యం అని అన్నారు.