హత్నూర: నవాబ్ పేటలో భారీగా కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవబ్ పేట్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నాగప్రభువు గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.