ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఐ.ఏ.ఎస్ ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. జిల్లా నూతన ఎస్పీ గా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన నితిక పంత్ తొలిసారిగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించు కున్నారు.