గుంతకల్లు: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుడి అరటి తోటకు నిప్పు, రూ.3,50లక్షలు నష్టం, పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాటిల్ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అరటి తోటకు సోమవారం నిప్పు పెట్టడంతో మొక్కలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి తనకున్న నాలుగు ఎకరాల పొలంలో అరటి పంట పెట్టారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అరటి తోటకు నిప్పు పెట్టడంతో రెండు ఎకరాలలోని మొక్కలు కాలిపోయాయి. దీంతో సుమారు రూ.3,50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.