అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీలో డీవైఎఫ్ఐ గుత్తి కమిటీ ఆధ్వర్యంలో బాల, బాలికలకు క్రీడా పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాలనీలో గురువారం జరిగిన పోటీలలో బాల, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలనీలోని బాల, బాలికలు కబడ్డీ, టైర్ గేమ్, గోనసంచి ఆట, రింగ్ ఆటతో పాటుగా పలు ఆటలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ గుత్తి మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ గత మూడు రోజులుగా జరిగిన మహిళలకు ముగ్గులు, ఆటల పోటీలు, బాల, బాలికలకు జరిగిన పోటీలలో విజేతలకు సంక్రాంతి పండుగ అనంతరం కనుమ రోజున బహుమతులను అందజేస్తామని అన్నారు.