పీలేరు పట్టణంలో గుండె పోటుతో హోంగార్డు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాల మేరకు పీలేరు మండలం పీలేరు పట్టణం సదుం రోడ్డు కొత్తపేటలో నివాసం ఉంటున్న వేణు, కెవిపల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం 10 గంటలకు తన విధుల నిమిత్తం వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా తన నివాసంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.