నందికోట్కూరు: సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రోడ్ల నిర్మాణం పనుల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు, శనివారం నందికొట్కూరు పట్టణంలోని నీలి షికారి పేటలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణం పనులను పరిశీలించారు, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు, వాటర్ క్యూరింగ్ సక్రమంగా చేయాలని సూచించారు