మద్దిపాడు మండలంలోని ముండ్లపాడు లో వైసిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మరియు మాజీ మంత్రి మెరుగ నాగార్జున సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ముండ్లపాడు లో వైసీపీ గ్రామ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ మంత్రి నాగార్జున మాట్లాడుతూ... సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి వైసిపి పటిష్టతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు.