బనగానపల్లె: నంద్యాల జిల్లా యువకుడికి మరో అరుదైన గౌరవం, సీఎం చేతుల మీదుగా స్వచ్ఛ్ ఆంధ్ర పురస్కారం
ఇటీవలే ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్న నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం యువకుడు యూట్యూబర్ శ్రీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డు అందించి సత్కరించింది. CM చంద్రబాబు చేతుల మీదుగా శ్రీకాంత్ ఈ పురస్కారాన్ని విజయవాడలో శుక్రవారం అందుకున్నారు. పూర్వ సంపద రక్షణ సేన పేరుతో మిత్రులతో కలిసి పురాతన బావులు, ఆలయాలు శుభ్రపరుసూ మన్ననలు పొందారు