గజపతినగరం: గంట్యాడ జెడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రంధి సరోజినీ
గంట్యాడ జెడ్పిటిసి స్థానానికి కూటమి అభ్యర్థిగా రంధి సరోజినీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.