పార్వతీపురం: కొమరాడలో ఉపాధి కూలీల నిరసన: పాత పద్ధతిలోనే ఉపాధి హామీని అమలు చేయాలని డిమాండ్
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. విబిజి రామ్ చట్టాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని, కూలీలకు రోజుకు రూ.600 వేతనం, 200 రోజుల పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.