పార్వతీపురం: పాము కాటుకు గురైన యువకుడికి పునర్జన్మ: విజయనగరం వైద్యుల సమయస్ఫూర్తి
పార్వతీపురం మన్యం జిల్లాలో న్యూరోటాక్సిక్ పాము కాటుకు గురైన 35 ఏళ్ల యువకుడిని విజయనగరం జీజీహెచ్ వైద్యులు కాపాడారు. శ్వాస సమస్యలతో అత్యవసర స్థితిలో వచ్చిన బాధితుడికి, వైద్య బృందం వెంటిలేటర్ మద్దతుతో చికిత్స అందించి ప్రాణాలను నిలబెట్టింది.