జగ్గంపేట: గోకవరం మండలంలో భారీ వర్షాలు: నిండుతున్న చెరువులు, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
గోకవరంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మేజర్, మైనర్ చెరువులు నిండుతున్నాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు పెరిగి, వేసవిలో సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.