శ్రీశైలం: మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించడంతో ఆత్మకూరు పట్టణంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న బిజెపి శ్రేణులు
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించడంతో ఆత్మకూరు పట్టణంలో బిజెపి నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మైనార్టీ రాష్ట్ర నాయకురాలు మోమిన్ షబానా ఆత్మకూరు పట్టణంలో బిజెపి నాయకులతో బాణసంచా కాల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ కమలం వికసిస్తుందని ఈ విజయానికి కృషి చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.