మండపేట: మండపేట నియోజకవర్గం లో సోమవారం మూడు నామినేషన్లు దాఖలు.. నియోజక వర్గ ఎన్నికల అధికారి ఎల్లారావు..
మండపేట నియోజకవర్గం లో సోమవారం మధ్యాహ్నం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు నియోజక వర్గ ఎన్నికల అధికారి ఎల్లారావు తెలిపారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన అల్లుడు టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు వి సాయి కుమార్ బాబు మరో నామినేషన్ దాఖలు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున సాదే డేవిడ్ రాజు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.