కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల భరత్ కుమార్ మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడటంతో తలకు తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.