శ్రీశైలం: వేల్పనూరు గ్రామంలో వ్యవసాయ పనులకు వెళుతూ అదుపుతప్పి బొల్త పడిన ట్రాక్టర్ . ఇద్దరు మృతి
వెలుగోడు మండలం వేల్పనూరు సమీపంలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పంట పొలాన్ని దుక్కి దున్నడానికి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనున్న గుంతలో బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ వెంకట శివతో పాటు వ్యవసాయ కూలీ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరూ వేల్పనూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.