జహీరాబాద్: సిపిఆర్ విధానం పై ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు 108 ఆధ్వర్యంలో అవగాహన
అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని 108 జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్, జిల్లా మేనేజర్ కిరణ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో శుక్రవారం జీవీకే ఈఎంఆర్ఐ 108 సేవల ఆధ్వర్యంలో సి పి ఆర్, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపిఆర్ విధానం, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశం, సిబ్బంది, ఈఎంటి లు విజయ్, సాయి శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు.