పూతలపట్టు: కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు: శనివారం వైభవంగా పుష్ప పల్లకి సేవ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పుష్ప పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు.