సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఏసిపి రవీందర్ రెడ్డి
సద్దుల బతుకమ్మ, సందర్భంగా కోమటి చెరువు, ఎర్ర చెరువు మరియు నర్సాపూర్, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పలువురు సీఐలతో కలిసి ఏసీపీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసుల సలహాలు సూచనలు పాటించి పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసి బతుకమ్మలు ఆడే ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్లాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులతో సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలన