పొన్నూరు: నూతనంగా నిర్మించిన రోడ్లు ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటాం: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు బుధవారం పట్టణంలో పర్యటించి, గుంటూరు - బాపట్ల మెయిన్ రోడ్డులో సత్య షోరూం వారు నూతనంగా నిర్మించిన రోడ్డును పగలగొట్టి అనధికార ఆక్రమణకు పాల్పడినట్టు గుర్తించారు. దీనితో వారికి .5 వేలు జరిమానా విధించారు. పట్టణంలో వ్యాపారస్తులు నూతనంగా నిర్మించిన రోడ్ల నాణ్యతను పాడుచేసి ప్రజల సురక్షిత ప్రయాణానికి ఇబ్బంది కలిగించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.