మడకశిర మాజీ ఎమ్మెల్యే మాతో లక్ష రూపాయలు తీసుకొని ఆర్ పి పోస్ట్ ఇచ్చాడు.
మడకశిర మాజీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి పై మడకశిర కు చెందిన డ్వాక్రా సంఘాల ఆర్పీలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆర్పీలుగా కొనసాగుతున్నందుకు అప్పటి ఎమ్మెల్యే తిప్పే స్వామికి డబ్బులు ఇచ్చినట్లు బయటకు చెబుతున్నారు.తాజాగా బుధవారం మడకశిరకు చెందిన పార్వతి, శ్రీదేవి అనే ఆర్పిలు తిప్పే స్వామి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్పీగా కొనసాగడానికి లక్ష రూపాయలు డబ్బులు అడిగాడని ఆయన అడిగిన డబ్బులు ఇచ్చి కొనసాగుతున్నామని వాపోయారు.