మద్దిపాడు లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వసతి గృహాల వార్డెన్స్ ను కలెక్టర్ హెచ్చరించారు.