కథలాపూర్: సీసీ రోడ్డు,డ్రైనేజీ పనులకు భూమిపూజ..హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మంగళవారం మండల మార్కెట్ డైరెక్టర్ కారపు గంగాధర్, సింగిల్ విండో డైరెక్టర్ మార్గం శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ పనులకు గాను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ రూ.9 లక్షలు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలేపు బలరాం, పాల్తెపు గంగారాం, బొర్రన్న,మోర్తాడ్ నర్సయ్య,లవకుమార్, గంగాధర్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.