ఒంగోలులో రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ జేవీ రమణయ్య మృతి.
Ongole Urban, Prakasam | Mar 28, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ అదుపుతప్పి కానిస్టేబుల్ జె.వి రమణయ్య మృతి చెందాడు. శనివారం సాయంత్రం బైక్ పై వస్తున్న రమణయ్య అదుపుతప్పి భాగ్యనగర్ మూడవ లైన్ వద్ద గోడను ఢీకొట్టాడు. ప్రమాదంలో రమణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో ఒంగోలు జిజిహెచ్ వైద్యశాలకు తరలించారు. అయితే రమణయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వేగంగా వస్తూ బైకు అదుపుతప్పి గోడం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.