ఒంగోలు నగరంలోని 47, 48 డివిజన్ లలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Jul 6, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని 47వ డివిజన్ మరియు 48వ డివిజన్ చంద్రయ్య నగర్ లో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు.