శ్రీశైలం: ఆత్మకూరుమున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం
ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె అదోని మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్ (కేటగిరీ-II) గా విధులు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ బదిలీల ఉత్తర్వుల్లో భాగంగా ఆమెను ఆత్మకూరుకు బదిలీ చేస్తూ, ఖాళీగా ఉన్న మున్సిపల్ కమిషనర్ పోస్టులో నియమించారు. తన స్వంత వేతన శ్రేణిలోనే ,ఈ నూతన బాధ్యతలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.