జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు జరిగే ఉత్సవాలకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ఉత్సవాలను సుఖశాంతుల మధ్య జరుపుకునేలా తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. సద్దుల బతుకమ్మ నాడు (సెప్టెంబర్ 30) నిమజ్జన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.