శ్రీశైలం: ఆత్మకు పట్టణంలో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు, ఉత్సాహంగా రంగుల మహోత్సవం నిర్వహించుకున్న యువకులు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఈస్టర్ పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.యేసుక్రీస్తు పునరుత్థానం పొందిన ఈ శుభ ఆదివారం సందర్భంగా స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు కొడుతూ, ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ వేడుకలను సందడిగా మార్చారు.ఈ సందర్భంగా యువకులు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కె. నాగన్న, బి. చంద్ర, సి. ప్రసాద్, బండారి రాజశేఖర్, బండారి సుంకన్న, వి. ప్రకాశ్, వై. సురేంద్ర తదితరులు మరియు స్థానిక యువకులు పాల్గొన్నారు.