ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం గుడికల్లు దగ్గర రోడ్డు
పూర్తిగా అధ్వానంగా ఉంది. మంత్రాలయం కు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు..
ఎమ్మిగనూరు: అధ్వానంగా గుడికల్లు దగ్గర రోడ్డు.. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు దగ్గర రోడ్డుపూర్తిగా అధ్వానంగా ఉంది. బళ్లారి నుంచి మంత్రాలయంకు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుండగా.. దాదాపు 2 కిలోమీటర్ల మేర రహదారి గుంతలతో నిండిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. కావున స్థానికులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.