గుంతకల్లు: పట్టణంలోని ధర్మవరం గేట్ వద్ద పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం, ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. గుంతకల్లు రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాల పై ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉంది. సోమవారం వేకువజామున అటుగా వెళ్తున్న స్థానికులు మహిళ మృతదేహాన్ని చూసి వెంటనే జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న జీఆర్పీ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని జీఆర్పీ పోలీసులు తెలిపారు.