బోధన్: బోధన్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి, రెంజల్, నవీపేట, సాలూరు, బోధన్ పట్టణంలో వేడుకలు కొనసాగాయి. గ్రామ, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు, పలు వీధుల్లో ప్రజా నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ సాధనలో అమరులైన వారిని స్మరించారు.