అమలాపురం: కోనసీమ జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు: గర్వకారణం అంటున్న అధికారులు
స్వచ్ఛతా రంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సత్తా చాటింది. జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించాయి. జిల్లాను మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్ది, వచ్చే ఏడాది రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఎంపీ, ఎమ్మెల్యే మరియు కలెక్టర్ స్పష్టం చేశారు.