ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరిగిపోయాయి ఒంగోలు మాజీ ఎంపీ, వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | Aug 2, 2026
రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని ఒంగోలు మాజీ ఎంపీ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలులో పర్యటించిన వై వి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కాపీ కొట్టారన్నారు. రాష్ట్రంలో అక్రమంగా అరెస్టులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ 2029 ఎన్నికలలో జగన్ గెలుస్తారని అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికరమైన వివరాలను వైవి సుబ్బారెడ్డి తెలిపారు.