సత్య సాయి జిల్లా హిందూపురం మండలం చౌలూరు గ్రామంలో కల్తీ కల్లు సేవించి 10 మందికి అస్వస్థతకు గురయ్యారు కుటుంబ సభ్యులు స్థానికులు వారిని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో 60 సంవత్సరాల పైబడి ఉన్న లక్ష్మీదేవి సంజీవరాయప్ప అనే వృద్ధులకు పరిస్థితి విషమంగా ఉందని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కల్తీకల్లు వల్లే వారికి అస్వస్థత కలిగిందని వారు రోజు కల్లు సేవించేవారు అని రోజు కూలికి వెళ్లి వచ్చి కల్లు సేవిస్తూ ఉంటారని తెలిపారు. రోజు కల్లు సేవిస్తూ ఒక్కసారిగా మానేయడం వల్ల ఈ పరిస్థితి తల్లితోందని డాక్టర్లు తెలిపారు