గజ్వేల్: కుకునూరుపల్లి ప్రభుత్వ ఐటిఐ లో అధునాతన సాంకేతిక కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి
కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐలో అధునాతన సాంకేతిక కేంద్ర ATC ప్రారంభోత్సవ కార్యక్రమం లో శనివారం జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా హైదరాబాద్ లోని మల్లేపల్లి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మొత్తం 65 అధునాతన సాంకేతిక కేంద్రాలను మంత్రులతో కలిసి వర్చువల్ గా ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. లక్ష్యం కోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మారుతున్న కాలం తో