పేద ప్రజల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Mar 30, 2026
పేద ప్రజల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని దానికి తగిన విధంగా ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సోమవారం జరిగిన నూతన గృహప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలియచేశారు. గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు స్థలాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందచేసి దాంట్లో ఇంటి నిర్మించుకునేందుకు గతం కంటే అదనంగా 2,50,000 ప్రభుత్వం సంకరిస్తున్నట్లు తెలియచేశారు. దీనిని పేద ప్రజల సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు అదనంగా 50 వేల నుండి లక్ష రూపాయల వరకు అదనపు సాయం అందిస్తుంది అన్నారు