మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ. 60.18 లక్షలు రాబడి. EO శ్రీనివాస రెడ్డి
మహానంది పుణ్యక్షేత్రంలో మహానందీశ్వర స్వామివారి హుండీ, ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించగా మహానందీశ్వర స్వామివారికి రూ. 60,18,167 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో ఎన్.శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మహానంది ఆలయంలోని అభిషేకం మండపంలో స్వామివారి హుండీతో పాటు ఉభయ దేవాలయాల హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 60 రోజులకు గాను స్వామివారికి రూ. హుండీ కానుకల ద్వారా రూ.59,21,476, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ. 69,515 ,గో సంరక్షణ హుండీ ద్వారా రూ.27,176, మరియు 2 గ్రాముల 950 మిల్లీ గ్రా ల బంగారం, 260 గ్రా ల వెండి ,మొత్తం రూ. 60, 18,167 రాబడి.