శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా శని ,ఆది వారాలు సెలవు దినాలు రావడంతో శ్రీశైలం భక్తులు పోటెత్తారు, స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. అలాగే భక్తుల రద్దీ దృష్య,కేవలం స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని, ఆయన తెలియజేశారు. భక్తులకు త్వరగా స్వామి అమ్మవార్ల దర్శనం పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.