అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన కవిరాజు ఎస్ జి టి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్- 2 ఫలితాల్లో సబ్ రిజిస్టర్ పోస్టును సాధించాడు. తొలుత ఎస్ జి టీ, తదుపరి ఎంపీడీవో పోస్టును సాధించిన అనివార్య కారణాలతో వైదొలిగానని ప్రస్తుతం శ్రమించి సబ్ రిజిస్టర్ పోస్టును సాధించానన్నారు. వికలాంగుడైన తనకు ఆరోగ్యం, చదువులకు ఆర్డిటి సంస్థ చేయూత అందించిందని, బెలుగుప్ప శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాల విద్యను ఉచితంగా అందించిందని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, డి.ఎస్.పి శ్రీరామచంద్రమూర్తి గైడెన్స్ లో చదివానని పేర్కొన్నారు.