విశాఖపట్నం: వెలుగు వివోఏల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు డిఆర్డిఏ పిడి ఆఫీస్ ముందు ధర్నా జరిగింది
మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని, మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆన్లైన్ వరకు చెప్పొద్దని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వెలుగు వివోఏల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం డిఆర్డిఏ పిడి ఆఫీస్ ముందుమంగళవారం ధర్నా నిర్వహించాము ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ మాట్లాడుతూ 3 నెలల బకాయి వేతనాలు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. సెల్ ఫోన్లు ఇవ్వకుండా 26 రకాల యాప్ వర్కు చెప్పడం దారుణం అన్నారు. ప్రభుత్వం తను చేస్తున్న పని ఒత్తిడిని కనీసం గమనంలోకి తీసుకోకుండావ్యవహరించడం అన్యాయంగా ఉందన్నారు.