మహబూబాబాద్: సీఐ శంకర్ అమర్యాదగా ప్రవర్తించి దురుసుగా మాట్లాడడని యూరియా పంపిణీ వద్ద ఆందోళన చేపట్టిన హమాలీలు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద హమాలీలు శుక్రవారం ఉదయం 11:00 లకు నిరసన వ్యక్తం చేశారు..సీఐ శంకర్ తమతో అమర్యాదగా ప్రవర్తించారని కొద్దిసేపు యూరియా బస్తాలు అందించకుండా నిరసన తెలిపారు..ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాల్సిన పోలీస్ అధికారులు తమపై దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు.. హమాలీలు నిరసన చేపట్టడంతో యూరియా పంపిణి వద్ద సందిగ్ధం నెలకొంది..నర్సింహులపేట ఎస్సై సురేశ్ హమాలీలకు నచ్చజెప్పి తిరిగి విధుల్లో చేరాలని కోరడంతో వారు తిరిగి యూరియా బస్తాలను రైతులకు అందించారు..