అమలాపురం అసెంబ్లీ టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కుమార్ను సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం
అమలాపురం నియోజకవర్గం టిడిపి రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ ను టిడిపి పార్టీ నుండి అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ నియమ నిబంధనలను అతిక్రమించి ఇండిపెండెంట్గా నామినేషన్ ధాఖలు చేయడంతో శ్యామ్ కుమార్ పై చర్యలకు ఉపక్రమించి అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ సీనియర్ నేతలు శ్యామ్ కుమార్ ను బుజ్జగించే ప్రయత్నంలో విఫలం అయ్యారు. పార్టీ తనకు టికెట్టు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసిన నేపథ్యంలోనే ఇండిపెండెంట్గా పోటీచేస్తున్నానని శ్యామ్ కుమార్ మీడియాకు తెలిపారు.